రేవంత్ రెడ్డి బాహుబలి: వర్మ

“రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు.” ఈ మాటలు అన్నది ఎవరో కాంగ్రెస్ నేత కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించగానే రామ్ గోపాల్ వర్మ ఈవిధంగా ఫేస్ బుక్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ఎప్పుడు ఎవరిని అవహేళన చేస్తూ కామెంట్స్ చేస్తారో ఎవరూ ఊహించలేరు. రేవంత్ రెడ్డి అదృష్టం బాగున్నందున వర్మ నోటిలో నుంచి ప్రశంశలు వచ్చాయని సరిపెట్టుకోవాలేమో? రేవంత్ రెడ్డి పార్టీ మారడం, తదనంతర పరిణామాలను సినీ పరిశ్రమలో వారు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ స్పష్టం చేస్తోంది.