ఏమిటిది నామా?

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తనను వేధిస్తున్నారంటూ జూబ్లీ హిల్స్ కు చెందిన ఒక మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. నామాకు తమ కుటుంబంతో మంచి పరిచయం ఉన్న కారణంగా ఆయన అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేవారని, కానీ ఒక అక్రమ సంబంధం వ్యవహారంలో తాను అతనిని ప్రశ్నించినప్పటి నుంచి అతను తన ఇంటికివచ్చి దూషిస్తున్నారని, ఫోన్ లో కూడా బెదిరిస్తున్నారని తెలిపింది. తన భర్త, పిల్లలు విదేశాలలో ఉంటునందున ఒంటరిగా జీవిస్తున్నానని ఆమె తెలిపింది. 

తనను నామా నాగేశ్వర్ రావు, ఆయన సోదరుడు నామా సీతయ్యలు ఇద్దరూ వేధిస్తున్నారని ఆమె పిర్యాదులో పేర్కొంది. తనపై పిర్యాదు ఉపసంహరించుకోకపోతే తన నగ్న చిత్రాలు బయటపెడతానని వారివురూ బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది. ఆమె మొదట పోలీసులకు పిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్ళడంతో తప్పనిసరి పరిస్థితులలో వారిరువురిపై ఐపిసి 506, 509 సెక్షన్ల కింద అక్టోబర్ 25వ తేదీన కేసులు నమోదు చేశారని ఆమె తెలిపింది. 

తనపట్ల నామా అసభ్యంగా మాట్లాడిన ఆడియో, వీడియో టేపులు సాక్ష్యాలున్నాయని తెలిపింది. నామా గురించి మోత్కుపల్లి నరసింహులుకి ఇంకా అనేకమంది తెదేపా నేతలకు పిర్యాదు చేశానని కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆమె తెలిపింది. చివరికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సెక్రెటరీ శ్రీనివాస్ ద్వారా ఈవిషయం తెలియపరిచినా వారు స్పందించలేదని ఆమె తెలిపింది. నామా నాగేశ్వరరావుకు వేశ్యాలోలుడని, ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి ఉందని, వావివరసలు కూడా చూడకుండా మాట్లాడుతారని ఆమె సాక్షి మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.