నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు షురూ

నేటి నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతాయి. సమావేశాలకు ముందు సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేసేందుకు మళ్ళీ బిఎసి సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 ఉదయం నుంచి సమావేశాలు మొదలవుతాయి. మొదటిరోజైన ఈరోజు కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించి సభను వాయిదా వేస్తారు. శని,ఆదివారాలు ఉభయసభలకు శలవుగా నిర్ణయించినందున మళ్ళీ సోమవారం నుంచి సమావేశాలు మొదలవుతాయి. 50 రోజులు పాటు సాగే ఈ శీతాకాల సమావేశాలు రోజూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.