అబ్దుల్ కరీం తెల్గీ మృతి

నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణంలో 30 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీం తెల్గీ (56) గురువారం బెంగళూరులో విక్టోరియా ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన గత కొన్ని రోజులుగా మెనింజైటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. వాటికి తోడూ హైషుగర్, బ్లడ్ ప్రెషర్ కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కన్నుమూశాడు. నకిలీ స్టాంప్ పేపర్ కుంభకోణంలో దోషిగా నిరూపించబడటంతో అతనికి 2006, జనవరి 17వ తేదీన 30 ఏళ్ళు కటిన కారాగార శిక్ష, రూ.200 కోట్లు జరిమానా విధించబడింది. అప్పటి నుంచి అతను బెంగళూరులో   పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.