తెలంగాణా తెదేపాలో ఒకపక్క రేవంత్ రెడ్డి వ్యవహారం కలకలం రేపుతుండగానే మరోపక్క తెదేపా మహిళా నేత కవిత కూడా పార్టీ వీడేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తనకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం లభించడం లేదనే బాధతో ఆమె తెదేపాకు గుడ్-బై చెప్పి భాజపాలో చేరిపోవడానికి సిద్దం అవుతున్నారు. ఆమె బుదవారం తెలంగాణా భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయ్యారు. ఆమె భాజపాలో చేరబోతున్నారని లక్షణ్ స్వయంగా మీడియా ప్రతోనిధులకు తెలియజేశారు. తమ పార్టీ ఆశయాలను, సిద్దాంతాల పట్ల, మోడీ పాలన పట్ల నమ్మకమున్నవారు ఎవరు వచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. కవిత త్వరలోనే తమ పార్టీలో చేరుతారని లక్ష్మణ్ తెలిపారు.