మజ్లీస్ నేతల ఇళ్ళపై ఐటి దాడులు

హైదరాబాద్ పాతబస్తీలో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అనుచరుల ఇళ్ళు, దుఖాణాలపై బుధవారం ఉదయం నుంచి మొదలైన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు ఈరోజు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని టోలీచౌకీ, ఇంజన్ బౌలి, శాస్త్రిపురం చార్మినార్ తదితర ప్రాంతంలో ఒకేసారి 10 చోట్ల ఐటి దాడులు సాగుతున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ సన్నిహిత సహచరుడు షానవాజ్ హుస్సేన్, మజ్లీస్ కార్యకర్తలు అక్తర్, ఒబైద్ మరియు ఇంకా అనేకమంది చిన్న చిన్న వ్యాపారుల ఇల్లు, దుఖాణాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇదివరకు ఎన్నడూ బారీ ఆర్ధికలావాదేవీలు చేయని వారందరూ నోట్లరద్దు తరువాత నుంచి హటాత్తుగా కోట్లాదిరూపాయల లావాదేవీలు చేస్తున్నట్లు ఐటిఅధికారులు గుర్తించడంతో ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం. తీగలాగితే డొంక కదిలినట్లు, వారి ద్వారా బహుశః ఒవైసీ సోదరుల  లావాదేవీలను బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది.