హవాలా కేసులో తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీతో బాటు సమైక్య రాష్ట్రంలో మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా ఈడి నోటీసులు పంపించినట్లు తాజా సమాచారం. ఎంబిఎస్ జ్యూవెలర్స్ యజమాని సుఖేష్ గుప్తా హవాలా కేసులో ఇరుక్కొన్నారు. ఆయనను ఆ కేసు నుంచి తప్పించేందుకు వారిరువురూ సతీష్ సనా అనే మరొక వక్తితో కలిసి డిల్లీ వెళ్ళారు. అక్కడ విదేశాలకు మాంసం ఎగుమతిచేసే ఖురేషి అనే వ్యక్తి ద్వారా సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు వారు రూ.2 కోట్లు ముట్టజెప్పారని ఈడి ఆరోపిస్తూ బొత్స సత్యనారాయణ, షబ్బీర్ అలీ ఇద్దరిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి నోటీసులు పంపించినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైకాపాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అయన ఇంకా స్పందించవలసి ఉంది.