ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమీషన్ బుదవారం గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ అచల్ కుమార్ జోతి ఈరోజు డిల్లీలో మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 9,14 తేదీలలో రెండు దశలలో జరుగుతాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
మొదటి దశలో 19 జిల్లాలలో గల 89 నియోజకవర్గాలలో, రెండవ దశలో 14 జిల్లాలలో గల 93 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి.
మొదటిదశ ఎన్నికలకు నోటిఫికేషన్: నవంబర్ 14, నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 21, నామినేషన్ల పరిశీలన: నవంబర్ 22, నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 24, మొదటిదశ పోలింగ్: డిసెంబర్ 9.
రెండవ దశ ఎన్నికలకు నోటిఫికేషన్: నవంబర్ 20, నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 27, నామినేషన్ల పరిశీలన: నవంబర్ 28, నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 30, పోలింగ్: డిసెంబర్ 14.
ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: డిసెంబర్ 18వ తేదీ.
గుజరాత్ లో మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 4.43 కోట్ల మంది ఓటర్లున్నారు. వారికోసం మొత్తం 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి అన్ని ఎన్నికల కేంద్రాలలో ఓటర్లకు రసీదునిచ్చే వివిప్యాట్ ఈవిఎం మెషిన్లను వినియోగించబోతున్నారు. నేటి నుంచే గుజరాత్ లో కూడా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమీషనర్ అచల్ కుమార్ జోతి తెలిపారు.