తెలంగాణా రాష్ట్రం ఏర్పడి సుమారు మూడున్నరేళ్ళవుతున్నా ఇంతవరకు ఉమ్మడి హైకోర్టు విభజన జరుగలేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు న్యాయమూర్తుల కేటాయించబడ్డారు.
విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణాకు 24 మంది, ఆంధ్రప్రదేశ్ కు 37మంది న్యాయమూర్తులను కేంద్రప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులకు సుప్రీంకోర్టు కోలీజియం కూడా ఆమోదముద్ర వేసింది.
తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన పోస్టులలో 18మంది శాశ్విత న్యాయమూర్తులు, 6 మంది అధనపు న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా ఏపికి 28మంది శాశ్విత న్యాయమూర్తులు, 9 మంది అధనపు న్యాయమూర్తులు ఉంటారు.
తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల పేర్లు:
జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ అనీస్, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ డి.అమరనాద్ గౌడ్, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ బి.శివశంకర రావు, జస్టిస్ పి.కేశవ రావు, జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు.
వీరిలో జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి ప్రస్తుతం గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఆగస్టులో పదవీ విరమణ చేశారు. జస్టిస్ అనీస్ గత వారం పదవీ విరమణ చేశారు. కనుక వారిరువురి స్థానాలలో మళ్ళీ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిన న్యాయమూర్తుల పేర్లు:
జస్టిస్ రమేష్ రంగనాథన్ (తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ డి.శేషాద్రినాయుడు, జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ టి.రజని, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు, జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ ఎ.శంకర నారాయణ, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎన్.బాలయోగి, జస్టిస్ డివిఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి,
వీరిలో జస్టిస్ డి.శేషాద్రినాయుడు కొద్ది రోజుల క్రితమే కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు.
ఉమ్మడి హైకోర్టు విభజన జరిగేంతవరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు కేటాయించిన న్యాయమూర్తులు అందరూ యధాప్రకారం రెండు రాష్ట్రాలకు సంబందించిన అన్ని కేసులను చూస్తారని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.