ఆ నాలుగు జిల్లాలకు సిరిసిల్లాలో పాస్ పోర్ట్ సేవలు

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల ప్రజలలో కొత్త పాస్ పోర్ట్, రెన్యువల్, తదితర సేవలు అవసరమైనవారి కోసం 25, 26 తేదీలలో సిరిసిల్లలో గల పొడుపు భవన్ లో పాస్ పోర్ట్ శిబిరం నిర్వహించబోతున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సేవలు పొందగోరేవారు ముందుగా www.passportindia.gov.in వెబ్ సైట్ లో తమ పేరిట స్లాట్లను బుక్ చేసుకోవాలని కోరారు. సిరిసిల్లాలోనే రెండు రోజుల పాటు పాస్ పోర్ట్ శిబిరం ఏర్పాటు చేస్తున్నందున ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.