గవర్నర్ నరసింహన్ కు మాతృ వియోగం

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి శ్రీనివాసన్ (94) ఈరోజు కనుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  ఈరోజు సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో గవర్నర్ నరసింహన్ ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.