మూడు రోజుల క్రితం డిల్లీలో సచివాలయం ముందు పార్క్ చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారును ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. డిల్లీకి సమీపంలో ఘజియాబాద్ లో రోడ్డుపక్కన వదిలివేయబడి దానిని ఈరోజు ఉదయం పోలీసులు కనుగొన్నారు. దానిని మళ్ళీ డిల్లీకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అప్పగించారు. అయితే దానిని ఎవరు దొంగతనం చేశారో వారు కనిపెట్టలేకపోయారు.
ఈ ఘటనపై ఆయన డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను నిలదీస్తున్నట్లు మాట్లాడటం విశేషం. ‘ముఖ్యమంత్రినయిన నా కారుకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? కారు దొంగతనం చిన్న విషయమే కావచ్చు కానీ సచివాలయంలో పార్క్ చేసిన కారు దొంగతనం కావడం గమనిస్తే డిల్లీలో శాంతి,భద్రతలు గాడి తప్పుతున్నట్లున్నాయి,” అన్నారు కేజ్రీవాల్.
డిల్లీకు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పటికీ అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కనుక డిల్లీ పోలీసులు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధీనంలో పనిచేస్తుంటారు. అందుకే కేజ్రీవాల్ ఆయనపై విమర్శలు గుప్పించగలిగారు.