సింగరేణిలో అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లాలోని రామగుండం సింగరేణి డివిజన్-3లో ఓపెన్ కాస్త క్వారీ-1 లో ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ బొగ్గును త్రవ్వి డంపర్ లలో లోడ్ చేసే హైడ్రాలిక్ షావెల్ యంత్రంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో మంటలు అంటుకొని నిమిషల వ్యవధిలో కాలి బూడిదైపోయింది. దాని ఆపరేటర్ భోజనానికి వెళ్ళిన సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు కానీ సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఈ సంగతి తెలియగానే సింగరేణి అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకొని మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సింగరేణి అధికారులు హుటాహుటిన ఆకక్డకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ అగ్నిప్రమాదం వార్త సింగరేణి అంతటా క్షణాలలో వ్యాపించడం కార్మికులు, వాటి కుటుంబాలు చాలా ఆందోళన చెందారు. కానీ ఎవరికీ ఏమీ కాలేదని తెలుసుకొన్నాక అందరూ తేలికపడ్డారు.