మంత్రి హరీష్ రావుకు నష్ట పరిహారం!

రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణలో అనేకమంది రైతుల భూములు తీసుకొంటూ ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఒకరు కావడం విశేషం. ఆయన 2011లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలోని 178,196 సర్వే నంబర్లలో మొత్తం 17.03 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దానికి 2012లో యాచారం తహసీల్దార్ కార్యాలయంలో తనపేరిట పట్టాదారు పాస్ పుస్తకం కూడా తీసుకొన్నారు. 

ఆ ప్రాంతంలో ఇప్పుడు ఫార్మా సిటీ కోసం జరుగుతున్న భూసేకరణలో దానిని ఆయన ప్రభుత్వానికి అప్పగించారు. ఆ ప్రాంతంలో రైతులందరితో బాటు ఆయన కూడా ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున రూ.2.12 కోట్లు నష్టపరిహారం అందుకొన్నారు.