అవును సాక్షాత్ ముఖ్యమంత్రి కారే దొంగలు ఎత్తుకుపోయారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నీలి రంగు ‘వేగాన్ ఆర్’ కారును ఈరోజు ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఆయన రోజూలాగే తన స్వంత కారులో ఉదయం డిల్లీలోని సచివాలయం చేరుకొని, తనకు కేటాయించబడిన పార్కింగ్ ప్లేస్ లో కారును పార్క్ చేసి లోపలకు వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకు క్రిందకు వచ్చి చూస్తే కారు కనిపించలేదు. కేజ్రీవాల్ వాడుతున్న కారు ఖరీదైన కారు కాదు. పైగా చాలా పాతది కూడా. దానితో తనకు చాలా కలిసి వచ్చిందనే సెంటిమెంటుతో ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన దానినే వాడుతున్నారు. అది ముఖ్యమంత్రి కారని కూడా చూడకుండా ఎవరో దొంగ దానిని ఎత్తుకుపోయాడు. అది దొంగతనానికి గురయినట్లుగా పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకొని దాని కోసం డిల్లీలో గాలింపు మొదలుపెట్టారు.