నేడు సూర్యాపేటలో సిఎం కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలకు కుడకుడ శివారులో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు శంఖుస్థాపన లు చేస్తారు. స్థానిక గొల్లబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.