ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఈవిధంగా ఉంటాయి. వాతావరణం అనుకూలిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్ లో బయలుదేరుతారు లేకుంటే రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధిపేటలో కొండపాక మండలం దుద్దెడ చేరుకొని అక్కడ జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయానికి, తరువాత పోలీస్ కమీషనరేట్ కార్యాలయానికి శంఖుస్థాపన చేస్తారు. ఆ తరువాత ఎన్నాన్ పల్లిలో మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన చేస్తారు. తరువాత సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సందర్శిస్తారు. అక్కడే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం సిరిసిల్లా చేరుకొని మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడ జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు అంటే అక్టోబర్ 12న సూర్యాపేటలో, అక్టోబర్ 13న నారాయణ్ ఖేడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.