సింగరేణిలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఈరోజు జరిగిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి అన్ని ఏరియాలలో కలిపి మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 52,534 మంది ఓటర్లలో 49,873 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈసారి అధికార తెరాస పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఉదృతంగా ప్రచారం నిర్వహించడం, దాని ప్రత్యర్ధి పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం చేయడంతో కార్మికులలో ఈ ఎన్నికల పట్ల ఆసక్తి పెరిగినట్లు భావించవచ్చు.  

కొత్తగూడెంలో 95.07 శాతం, కార్పోరేట్ ఏరియా: 94.51 శాతం, శ్రీరాంపూర్: 92.99 శాతం, బెల్లంపల్లి: 95.41 శాతం, మణుగూరు: 96.43 శాతం , మందమర్రి: 92.75 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 

కొద్దిసేపటి క్రితమే ఏరియాల వారిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరో ౩-4 గంటలలోపే తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెరాస అనుబంధ సంస్థ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘానికి, ప్రతిపక్షాలు బలపరుస్తున్న ఎఐటియుసికి మద్య జరిగాయి.