సంబంధిత వార్తలు
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7గంటలకు మొదలైంది. ఇప్పటి వరకు ఎటువంటి ఘర్షణలు, అవాంచనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుండటంతో పోలీసులకు ఉపశమనంగా ఉంది. సింగరేణిలో మొత్తం 52,531 మంది ఓటర్లలో మధ్యాహ్నం 12 గంటల వరకు 31,764 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరాంపూర్: 60 శాతం, రామగుండం: 52 శాతం, భూపాలపల్లి: 50.2 శాతం, బెల్లంపల్లి: 72 శాతం, మందమర్రి: 59 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 7గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలుపెట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.