జగతి పబ్లికేషన్స్ చైర్మన్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి, సాక్షి న్యూస్ ఎడితోరియాల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తికి అరెస్ట్ వారెంటులు జారీ అయ్యాయి. గత ఏడాది సాక్షి పత్రికలో జిల్లా తెదేపా రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులపై ఒక విశ్లేషనాత్మక కధనం ప్రచురించబడింది. దానిలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిరాధారమైన ఆరోపణలున్నాయని కనుక ఆ పత్రిక యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంజనేయులు నూజివీడు 2వ అధనపు జ్యూడిషియల్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు.
ఈ కేసులో వారిరువురూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినప్పుడు, వారిని స్పెషల్ వకాల్తా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ వారు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో, న్యాయమూర్తి నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారిరువురిని అరెస్ట్ చేసి కోర్టులో తన ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు.