నిజామాబాద్ జిల్లాలో భోధన్ కు చెందిన ప్రొఫెసర్ నరేష్ పట్వారీకి ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం ముంబై ఐఐటిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. రసాయన శాస్త్రం (కెమికల్ సైన్స్)లో ఆయన విశేషప్రతిభకు గుర్తింపుగా ఆయనను ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్.) ఈరోజు ప్రకటించింది. శాస్త్ర, సాంకేతిక, ఉన్నత విద్యారంగంలో ఇది అత్యున్నత అవార్డుగా భావిస్తారు. ఈ అవార్డుతో బాటు రూ.5లక్షల నగదు బహుమతి, 65 ఏళ్ళు వయసు వరకు ప్రతీ నెల రూ.15,000 అందజేస్తారు.
నరేష్ పట్వారి 1992లో ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ చేశారు. తరువాత యూనివర్సిటీ హైదరాబాద్ లో ఎంఎస్సీ చేశారు. ఆ తరువాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ లో 2000 సం.లో పి.హెచ్.డి. చేశారు. తరువాత జపాన్, అమెరికా యూనివర్సిటీలలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేసిన తరువాత 2003లో ముంబై ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా చేరారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు.