ఏపికి వెళ్ళనున్న సిఎం కేసీఆర్

ఏపి మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం వివాహం అనంతపురం జిల్లా రామగిరి మండలంలో వారి స్వగ్రామం  వెంకటాపురంలో అక్టోబర్ 1న జరుగబోతోంది. దానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 1న అంటే అంటే ఆదివారం మధ్యాహ్నం 11.15గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగం పేట విమానాశ్రయానికి చేరుకొంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో పుట్టపర్తి చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో నేరుగా వెంకటాపురంలో వారి పెళ్ళికి హాజరవుతారు. మళ్ళీ మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాఫ్టర్ లో పుట్టపర్తి చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు విమానంలో హైదరాబాద్ చేరుకొంటారు. అంటే కేవలం మూడు గంటల వ్యవధిలోనే అనంతపురం వెళ్ళి తిరిగి వచ్చేస్తారన్నమాట! 

మళ్ళీ చాలా రోజుల తరువాత ముఖ్యమంత్రులిద్దరూ ఈ పెళ్లి వేడుకలో కలుస్తున్నారు. ఈ శుభకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో బాటు తెలంగాణాకు చెందిన తెదేపా నేతలు కూడా హాజరుకాబోతున్నారు.