కీసరగుట్టవద్ద కూలిన విమానం

మేడ్చల్ జిల్లాలో కీసర సమీపంలో అంకిరెడ్డిపల్లి పెద్దమ్మ చెరువు వద్ద కొద్ది సేపటి క్రితం వాయుసేనకు చెందిన ఒక శిక్షణా విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలెట్ తో బాటు మరో ఇద్దరున్నారు. ముగ్గురూ పారాచూట్స్ సహాయంతో తప్పించుకొని సురక్షితంగా క్రిందకు దిగారు. విమానంలో సాంకేతికలోపం తలెత్తడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. హకీమ్ పేటలోని విమాన శిక్షణా కేంద్రం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో  సాంకేతికలోపం తలెత్తి కూలిపోయింది. కూలిపోయిన కొద్దిసేపటికే మంటలలో కాళి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో పెద్దమ్మ గుట్టల మద్య జరుగడంతో స్థానికులు ఎవరికీ హాని జరుగలేదు. ఈ సంగతి తెలిసిన వెంటనే వాయుసేన ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.