1965లో భారత్-పాక్ మద్య జరిగిన యుద్దంలో భారత్ విజయంలో చాలా కీలకపాత్ర పోషించిన మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ (98) శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు కేంద్రప్రభుత్వం చాలాఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన గౌరవార్ధం నేడు యావత్ దేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయజెండాను అవనతం చేయబడ్డాయి.
ఈరోజు డిల్లీలో బ్రార్ స్క్వేర్ వద్ద ఆయన అంత్యక్రియలు సకల ప్రభుత్వం లాంచనాలతో త్రివిద దళాల గౌరవవందనంతో చాలా ఘనంగా ముగిశాయి. అయన అంత్యక్రియలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు, పలువురు అధికార, ప్రతిపక్ష నేతలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. అర్జన్ సింగ్ గౌరవార్ధం 17 మంది సైనికులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. అదే సమయంలో ఆయన భారతః వాయుసేనకు చేసిన సేవలకు గుర్తింపుగా వాయుసేన యుద్దవిమాన విన్యాసాలు నిర్వహించి ఆయన పట్ల గౌరవం చాటుకొంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం డిల్లీలో ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకు శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
అర్జన్ సింగ్ 1964 నుంచి భారతవాయుసేన అధిపతిగా సేవలు అందించారు. 2002లో ఆయన మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా నియమింపబడ్డారు. ఫీల్డ్ మార్షల్ శ్యాం మాణిక్ షా తరువాత వాయుసేనలో ఐదు నక్షత్రాలు పొందిన ఏకైక అధికారి అర్జన్ సింగ్ మాత్రమే.