రాష్ట్ర సమాచార కమీషన్ కు ప్రధాన కమీషనర్,
కమీషనర్ నియామకాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో
సమావేశమయ్యి చర్చించారు. తెలంగాణా శాసనసభ మాజీ కార్యదర్శి రాజా సాదారాంను రాష్ట్ర సమాచార
కమీషన్ (ఆర్.టి.ఐ.) ప్రధాన కమీషనర్, బుద్దా మురళిని కమీషనర్ గా నియమించాలని
సమావేశంలో నిర్ణయించారు. మరికొద్ది సేపటిలో వారి నియామకాలను ఖరారు చేస్తూ
ఉత్తర్వులు జారీ కానున్నాయి.
రాజా సాదారాం ఆగస్ట్ 31న పదవీ విరమణ
చేశారు. పదవీ విరమణ చేసిన 15 రోజులలోనే ఇటువంటి ఉన్నత పదవి లభించడం విశేషమే. శాసనసభ
కార్యదర్శిగా ఉన్నప్పుడు అధికార, ప్రతిపక్షాల నేతలందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ అందరితో
చక్కటి సంబందాలు కలిగి ఉండటమే ఆయనకు ఈ పదవిని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఈ
సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.