భార్య జైల్లో..భర్త ఐసియులో...

జయలలిత ఆకస్మిక మరణం తరువాత శరవేగంగా పావులు కదిపి అధికార అన్నాడిఎంకె పార్టీపై, ప్రభుత్వంపై పట్టుసాధించి ముఖ్యమంత్రి కావాలనుకొన్న శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే, తెర వెనుక ఉంటూ పార్టీపై పట్టుసాధించడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఆమె భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ప్రస్తుతం చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతుండటం విచిత్రం. 

ఆయనకు గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దానికోసం గతంలో కొన్నిసార్లు చికిత్స తీసుకొన్నారు కూడా కానీ ఆదివారం రాత్రి అయన ఆరోగ్యం హటాత్తుగా క్షీణించడంతో గ్లోబల్ ఆసుపత్రికి తరలించబడ్డారు. 

లివర్ సమస్య కారణంగా రెండు కిడ్నీలు పనిచేయడం మానేశాయి. ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు ఆయనకు ఐసియులో డయాలసిస్ చేశారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా విషమించిన్నట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపటిలో ఆయనకు వైద్యులు లివర్ ఆపరేషన్ చేయబోతున్నట్లు సమాచారం. 

దురాశతో అడ్డుదారిలో ప్రయాణించి అధికారం హస్తగతం చేసుకొందామని ప్రయత్నించిన భార్యాభర్తలిద్దరికీ చనిపోయిన అమ్మ ఉసురే తగిలిందో లేక ఆ భగవంతుడే వారిని ఈవిధంగా శిక్షిస్తున్నాడో...?