రావులపాటికి కాళోజీ అవార్డు

తెలంగాణా ప్రభుత్వం ఏటా ఇస్తున్న కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి రావులపాటి సీతారాంకు ప్రధానం చేసింది. రవీంద్రభారతిలో జరిగిన కాళోజీ 103వ జయంతి కార్యక్రమంలో సీతారాంకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి ఈ అవార్డును, దానితో బాటు రూ.1,01,116 నగదు బహుమతిని అందజేశారు. 2015 సంవత్సరానికి అమ్మంగి వేణుగోపాల్, 2016 సంవత్సరానికి ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న కాళోజీ అవార్డులు అందుకొన్నారు.

రావులపాటి సీతారాం ఖమ్మం జిల్లాలో ఆరెంపు గ్రామంస్తులైన రావులపాటి నారాయణ, మాణిక్యం దప్మతులకు  జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆధునిక తెలుగు సాహిత్యం  అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. రక్తస్పర్శ, ఇదిగో ఇక్కడి దాకే, సన్నాఫ్ మాణియిం, కుప్పం కవితలు వంటి అనేక రచనలు చేసి అందరి ప్రశంశలు పొందారు. తన రచనా వ్యాసంగం ద్వారా ఎంత పేరుప్రతిష్టలు వచ్చినా రావులపాటి సీతారాం ఒక సాధారణమైన వ్యక్తి లాగే చాలా నిరాడంబరంగా జీవితం గడుపుతుంటారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు.