హైదరాబాద్ వాసులు కళ్ళ ముందు కనిపిస్తున్న మెట్రో రైల్ ఇంకా ఎప్పుడు కదులుతుందా అని చిరకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక అది కదిలే సమయం వచ్చేసింది. నాగోలు-మియాపూర్ మద్య నడిచే మెట్రో రైల్ ను నవంబర్ 28వ తేదీన ప్రారంబించవలసిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుదవారం ఒక లేఖ వ్రాశారు.
ఆ లేఖలో తాను ఇదివరకు డిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించవలసిందిగా ఆహ్వానించగా అందుకు మీరు అంగీకరించారని గుర్తు చేశారు. కనుక నవంబర్ నెలలో అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు కూడా హాజరవుతానని మాట ఇచ్చారు. కనుక ఆ సదస్సుకు హాజరైనప్పుడే మెట్రో రైల్ ప్రారంభోత్సవం కూడా చేయవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన లేఖలో ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్ధించారు. కనుక నవంబర్ 28 నుంచి మెట్రో రైల్ పరుగులు పెట్టడం ఖాయం అని స్పష్టం అవుతోంది.