సంబంధిత వార్తలు
తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి గుర్తింపుగా భారత వ్యవసాయ, ఆహార మండలి (ఐ.సి.ఎఫ్.ఎ) ప్రకటించిన అగ్రికల్చరల్ లీడర్ షిప్ అవార్డ్-2017ను ఆయన తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వీకరిస్తారు. డిల్లీలో తాజ్ ప్యాలెస్ లో మంగళవారం సాయంత్రం ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలోనే ఉన్నప్పటికీ ఈరోజు కంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నారు కనుక ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యి అవార్డు స్వీకరించలేకపోతున్నారు.