వంగవీటి దంపతులు గృహ నిర్బంధం

ఇద్దరు వైకాపా నేతల మద్య మొదలైన ఘర్షణతో విజయవాడలో హటాత్తుగా కలకలం మొదలైంది. వైకాపాకు చెందిన  వంగవీటి రాధా, గౌతంరెడ్డి వర్గాల మద్య చాలా కాలంగా రాజకీయ విభేదాలున్నాయి. వారిలో గౌతంరెడ్డి వంగవీటిని ఉద్దేశ్యించి ‘గూండాయిజం చేసేవారికి తగిన శాస్తి జరుగక తప్పదు. కనుక వంగవీటి తన తీరు మార్చుకొంటే మంచిదని’ మీడియాతో అన్నట్లు సమాచారం. ఆ వ్యాఖ్యలు సహజంగానే వంగవీటి రాధ వర్గానికి ఆగ్రహం కలిగించడంతో వారు ఆదివారం గౌతం రెడ్డి నివాసానికి సమీపంలో గల ఒక కళ్యాణమండపంలో సమావేశమవ్వాలని నిర్ణయించుకొన్నారు. దానితో ఇరువర్గాల మద్య గొడవలు జరిగి అవి నగరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు సమావేశానికి బయలుదేరుతున్న వంగవీటి రాధ దంపతులను గృహనిర్బంధం చేశారు. పార్టీకి అప్రదిష్ట కలిగించే విధంగా వ్యవహరించినందుకు గౌతం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది.