కేంద్రమంత్రివర్గం పునర్యవ్యవస్తీకరణలో భాగంగా 9 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎన్డీయే కూటమిలో సభ్య పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. కొత్త మంత్రులు అందరూ భాజపా ఎంపిలే. ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, తెలంగాణా నుంచి మురళీధర్ రావులకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందని వార్తలు వచ్చాయి కానీ వారిరువురి పేర్లు తుది జాబితాలో లేవు. ఇక ఇప్పటికే సహాయమంత్రులుగా ఉన్న నలుగురికి కేంద్రమంత్రులుగా పదోన్నతి లభించింది.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో వారి ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. మొదట సహాయమంత్రులు నలుగురు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ లు ప్రమాణస్వీకారం చేశారు. వారి తరువాత వరుసగా అశ్విని కుమార్ చౌబే (బిహార్) రాజ్ కుమార్ సింగ్(బిహార్), సాంబశివరావు ప్రతాప్ శుక్లా (ఉత్తరప్రదేశ్), సత్యపాల్ సింగ్ (ఉత్తరప్రదేశ్), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), అనంతకుమార్ హెగ్డే (కర్నాటక), గజేంద్ర సింగ్ షెఖావత్ (రాజస్థాన్), అల్ఫాంస్ కనంతనం(కేరళ), హర్ దీప్ సింగ్ పూరి (మాజీ ఐ.ఎఫ్.ఎస్.) సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.