కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త!

తెలంగాణా నిరుద్యోగులకు, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగులకు శుభవార్త! జూనియర్ కాలేజీలలో 1133 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 21 విభాగాలలో 69మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ నియామకానికి ఆమోదం తెలిపారు.  

అలాగే వివిధ జిల్లాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు (63 మంది)కి ప్రస్తుతం ఇస్తున్న జీతాలను ఒకేసారి రెట్టింపు చేశారు.

 పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల (53 మంది)కి నెలకు ఇస్తున్న రూ.3,900 గౌరవ వేతనాన్ని కూడా రూ.7,800 కి పెంచారు.  అనేక మంది ఉద్యోగుల జీతాలు బారీగా పెంచారు. ఇంకా వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు కూడా బారీగా పెంచారు. 

ఆ వివరాలు: 

సర్వశిక్షా అభియాన్ లో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు (2,690 మంది)కి నెలకు ఇస్తున్న గౌరవ వేతనం రూ.6,000 ను రూ.9,000 కు పెంచారు.

కస్తూర్బా విద్యాలయాలలో చేస్తున్న 391 మంది స్పెషల్‌ ఆఫీసర్ల: రూ.21,000 నుంచి రూ.25,000

క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, కోఆర్డినేటర్లు: రూ.11,400 నుంచి రూ.15, 000 

కోఆర్డినేటర్లు: రూ.13,000  నుంచి రూ.15,000 

ఎంఐఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు: రూ.12,000 నుంచి రూ.14,000

సిస్టం అనలసిస్ట్: రూ.15,000 నుంచి రూ.16,500 

డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు: 16,500-17,500

టెక్నికల్‌ కన్సల్టెంట్లకు రూ.25,000 నుంచి రూ.35,000

సీనియర్‌ ప్రోగ్రామ్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్స్: రూ.35,000 నుంచి రూ.40,000

2,737 మంది సీఆర్టీలకు రూ.15,000 నుంచి రూ. 20,000

391 మంది అకౌంటెంట్లకు రూ. 10,000 నుంచి రూ.11,000

మెసెంజర్లకు: రూ.8,000 నుంచి రూ. 8,500 

అటెండర్లకు రూ.10,000 నుంచి రూ.12,000

391 మంది ఎ.ఎన్‌.ఎంలకు రూ.9,000 నుంచి రూ.11,000

డ్రైవర్లకు రూ.13,000 నుంచి రూ.15,000

391 పీఈటీలకు రూ.11,000 నుంచి రూ.12,000

 782 మంది ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లకు: రూ.5,000 నుంచి రూ.6,000 వేతనాలు పెంచారు.