తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడిన కేసీఆర్, ఈ బక్కమనిషి ఇంత బరువు బాధ్యతలు మోయగలరా? అని ప్రశ్నిస్తూనే ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర రాజకీయాలను ఏవిధంగా శాసిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తన మాటలతో రాజకీయ ప్రత్యర్ధులను గడగడలాడించే ఆయనకు ఇంజక్షన్ చేయించుకోవాలన్నా చాలా భయం అనే సంగతి ఈ మద్యనే బయటపడింది. అందుకే ఆయన తన కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి అనేకసార్లు డిల్లీ వెళ్ళినప్పటికీ ఏదో ఓ సాకుతో దానిని వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయన మళ్ళీ అదేపని మీద శుక్రవారం సాయంత్రం డిల్లీ వెళ్ళారు. ఈనెల 5న మళ్ళీ ఆపరేషన్ కు వైద్యులు ముహూర్తం పెట్టారు. ఒకవేళ ఈ సారి ఆపరేషన్ చేయించుకొన్నట్లయితే ఆయన ఆసుపత్రిలో 3-4 రోజులు ఉండవలసి ఉంటుంది. కానీ ఈసారైన ఆయన ఆపరేషన్ చేయించుకొంటారో లేక మళ్ళీ ఏదో సాకుతో వాయిదా వేసుకొని తిరిగి వచ్చేస్తారో చూడాలి.