కాకినాడలో తెదేపా విజయకేతనం

కాకినాడ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 48 డివిజన్లలో 32 డివిజన్లలో తెదేపా విజయం సాధించి కాకినాడ మేయర్ పీఠం దక్కించుకొంది. వైకాపా 10 స్థానాలు, భాజపా కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకొన్నాయి. నంద్యాల ఉపఎన్నికలు తరువాత ఈ ఎన్నికలలో వరుసగా విజయాలు సాధించడంతో తెదేపా శ్రేణులు ఆనందోత్సాహాలతో పొంగిపోతుంటే, నిన్న మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి చాలా హడావుడి  చేసిన వైకాపా నేతలు పత్తా లేకుండా పోయారు. అతి సాధారణమైన ఈ రెండు ఎన్నికలను  జీవన్మరణ సమస్యగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి అంతా తానై ఈ ఎన్నికల కోసం చాలా ఉదృతంగా ప్రచారం చేయడంతో ఈ రెండు ఓటములు పార్టీ ఓటమిగా కాక ఆయన స్వంత ఓటమిగానే మారాయి.