డ్రగ్స్ దందాలో నిట్ విద్యార్ధులు!

నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) వంటి ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యాసంస్థలలో చదువుకొనే విద్యార్ధులు వారి జీవితంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకొంటారని ఎవరైనా భావిస్తారు. కానీ వరంగల్ నిట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న రమేష్, బిజ్జు అనే ఇద్దరు విద్యార్ధులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ సరఫరాదారులను విచారించినప్పుడు వరంగల్ లో వారిద్దరూ డ్రగ్స్ సరఫరా చేస్తుంటారనే సంగతి బయటపడింది. వరంగల్ పోలీసులు వెంటనే ఈరోజు సాయంత్రం నిట్ కళాశాలకు చేరుకొని వారిరువురినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకొన్నారు. ఇది చూసి నిట్ కళాశాల విద్యార్ధులు, అద్యాపకులు, యాజమాన్యం అందరూ నివ్వెరపోయారు.