నంద్యాలలో తెదేపా ఘన విజయం!

కర్నూలు జిల్లాలోని నంద్యాల శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలలో తెదేపా అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి వైకాపాకు చెందిన తన సమీప ప్రత్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. ఈరోజు ఉదయం కౌంటింగ్ మొదలైన తరువాత మొదటి రౌండ్ నుంచే ఆధిఖ్యత కనబరుస్తూ దానిని చివరి రౌండ్ వరకు కొనసాగించారు. 

ఈ ఉపఎన్నికలలో తెదేపా భూమా బ్రహ్మానందరెడ్డికి: 97,076, శిల్పామోహన్ రెడ్డికి : 69,610, కాంగ్రెస్ అభ్యర్ధి అబ్దుల్ ఖాదర్ కు: 1,382 ఓట్లు పడ్డాయి. ఈ ఉపఎన్నికలలో 1,231 నోటా ఓట్లు (పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు) కూడా పడ్డాయి.