పిలోని అజాంఘడ్ నుంచి డిల్లీ వెళుతున్న కైఫియత్ ఎక్స్ ప్రెస్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు యుపిలో ఔరియా జిల్లాలో పటా-ఆచల్దా స్టేషన్ల మద్య పట్టాలు తప్పింది. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంగతి తెలియగానే రైల్వే అధికారులు, పోలీసులు, వైద్య సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందినట్లు ఇంకా సమాచారం లేదు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే యుపిలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హరిద్వార్ వెళుతున్న ఉత్కల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మళ్ళీ ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.