యూపిలో ఘోర రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ శనివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ కు వెళుతున్న పూరీ- హరిద్వార్-కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ (18477) శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లో ముజఫర్ నగర్ జిల్లాలో ఖతౌలి అనే ప్రాంతం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు చనిపోగా మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరుగడంతో రైలు బోగీలు ఒకదానిపైకి మరొకటి ఎక్కిపోయాయి. దాని వలన ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.   

ఈ సమాచారం అందుకొన్న రైల్వే అధికారులు తక్షణమే స్పందించి గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం డిల్లీకి సుమారు 100 కిమీ దూరంలోనే ఉండటంతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ ప్రమాదంలో గాయపడినవారి బందువుల కోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అవి: 97605 34054, 97605 3 5101. మీరట్ జిల్లాలో ఆసుపత్రిలో హెల్ప్ లైన్ నెంబర్: 94544 55183.