సింగరేణి అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలను ఆ సంస్థ యాజమాన్యం పెంచింది. ఈ మేరకు సంస్థ సి.ఎం.డి ఎన్.శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్-స్కిల్డ్ వర్కర్లకు ప్రస్తుతం రోజుకు రూ.313.25 చెల్లిస్తుండగా అదిప్పుడు 350.00కు పెరిగింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ప్రస్తుతం రోజుకు రూ.330.64 చెల్లిస్తుండగా అదిప్పుడు 494.00 కు పెరిగింది. ఈ ఏడాది జనవరి 19 నుంచి ఈ జీతాల పెంపు అమలులోకి వచ్చినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కనుక జనవరి నుంచి ఆగస్ట్ వరకు 8 నెలల ఎరియర్స్ కూడా వారికి లభించనున్నాయి. దీని వలన సంస్థలో మొత్తం 14,921 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు లబ్ది పొందనున్నారు. ఈ పెరిగిన జీతల వలన సింగరేణి సంస్థపై ఏడాదికి రూ.2.07 కోట్లు అధనపు భారం పడుతుందని శ్రీధర్ చెప్పారు.