కొత్త మెట్రో పాలసీని ఆమోదించిన కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల విస్తరణకు సబందించి ఒక సరికొత్త పాలసీని ఆమోదించింది. దాని పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, పొడిగింపులకు నిర్దిష్టమైన విధివిధానాలు, వాటికి నిధుల ఏర్పాటు గురించి ఈ కొత్త పాలసీలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో డిల్లీ, గురుగావ్, జైపూర్, ముంబై, కోల్ కతా, చెన్నై,       హైదరాబాద్ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులున్నాయి. ఏపిలో కొత్తగా విజయవాడ, విశాఖ నగరాలలో మెట్రో రైల్ నిర్మాణం జరుగబోతోంది. దేశంలో నాగపూర్, అహ్మదాబాద్, పూణే, లక్నో తదితర నగరాలలో మెట్రో రైల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా అనేక రాష్ట్రాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలున్నాయి. కనుక ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్దిష్టమైన విధివిధానాలు అవసరమని భావించిన కేంద్రప్రభుత్వం వాటి కోసం ఈరోజు పాలసీ ప్రకటించింది.