2345 పోస్టుల భర్తీ నోటిఫికేషన్స్ జారీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు స్వాతంత్ర్య దినం సందర్భంగా గోల్కొండ కోట వద్ద ప్రసంగిస్తూ త్వరలోనే ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వెలువడతాయని ప్రకటించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేసింది. 

వైద్య, భీమా, అటవీ శాఖలలో మొత్తం 2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేసింది. వాటిలో వైద్యవిధానా పరిషత్ లో సివిల్ సర్జన్స్-205 పోస్టులు, అసిస్టెంట్ సర్జన్స్ (డెంటల్)-10 పోస్టులు, వైద్యవిద్యా విధాన పరిషత్ లో ట్యూటర్లు, రేడియాలజీ ఫిజిక్స్ విభాగంలో అద్యాపకులు కలిపి మొత్తం 65 పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేసింది. 

భీమావైద్య సేవల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్-43 పోస్టులు, అసిస్టెంట్ ఫిజియో థెరపిస్ట్-2 పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేసింది. ఇక అటవీశాఖలో  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్-67, సెక్షన్ ఆఫీసర్స్-90, బీట్ ఆఫీసర్స్-1867 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేసింది. వీటి పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్ సైట్ లో చూడవచ్చు.