సంబంధిత వార్తలు
ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈరోజు భువనేశ్వర్ లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా సొమ్మసిల్లిపోయారు. పక్కనే ఉన్న భద్రాతా సిబ్బంది ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. తరువాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేవలం నీరసం కారణంగా ఆయన కొద్దిగా అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈరోజు జరుగవలసిన మిగిలిన అన్ని కార్యక్రమాలకు ఆయన యధావిధిగా హాజరవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.