తిరుపతిలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన బాబు

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. గత ఏడాది కర్నూలు జిల్లాలో నిర్వహించగా ఈ ఏడాది చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నిర్వహిస్తోంది. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం జాతీయజెండా ఎగురవేశారు. తరువాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.