స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు గోల్కొండ ఖిల్లా రెడీ

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తోంది. కనుక మళ్ళీ ఈరోజు జరుగబోయే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటను విద్యుత్ దీపాలు, రంగురంగుల జెండాలతో అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా నాల్గవసారి గోల్కొండ కోటపైన మువ్వన్నెల జెండా ఎగురవేయబోతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి గోల్కొండ కోటకు బయలుదేరారు. గోల్కొండ కోటకు చేరుకొని పతాకావిష్కరణ చేసి పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించబోతున్నారు. తరువాత వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు, అధికారులకు, విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు ప్రధానం చేస్తారు.