మాజీ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే స్వర్గీయ ఎం.ఓంకార్ కుమారుడు డాక్టర్ విజయ్ కుమార్, ఆయన అత్తగారు సోమవారం నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక కారు ప్రమాదంలో మృతి చెందారు. అయన తన భార్య, అత్తగారు మరొక దగ్గర బందువుతో కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ముందు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డాక్టర్ విజయ్ కుమార్, ఆయన అత్తగారు ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఆయన భార్య, సమీప బంధువుకు తీవ్రగాయాలయ్యాయి కానీ ప్రాణాలతో బయటపదినట్లు సమాచారం. ఆ సమయంలో అటుగా వెళుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం వెంటనే వారిని తన కారులో నార్కాట్ పల్లిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డాక్టర్ విజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.