స్ఫూర్తి యాత్ర వాయిదా

శనివారం హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాల్సిన తెలంగాణా అమరవీరుల స్ఫూర్తి యాత్రను వాయిదా వేసుకొన్నట్లుగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. పోలీసులు అనుమతించనందున తన యాత్రను వాయిదా వేసుకొన్నట్లు చెప్పారు. స్పూర్తియాత్ర సందర్భంగా శుక్రవారం కామారెడ్డిలో అరెస్ట్ చేసిన టిజెఎసి కార్యకర్తలు అందరినీ తక్షణమే విదుదల చేయాలని కోదండరామ్ కోరారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో జెఏసి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. దానిలో జిల్లా సమస్యలు, అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చిస్తామని తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజాసమస్యల పరిష్కారం కోసం తన పోరాటాలు కొనసాగిస్తానని కోదండరామ్ చెప్పారు.