సంబంధిత వార్తలు
టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేపట్టిన తెలంగాణా అమరవీరుల స్ఫూర్తి యాత్రను తెరాస కార్యకర్తలు అడ్డుకొన్నందుకు, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినందుకు నిరసనగా టిజెఎసి నేడు కామారెడ్డి జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య పద్దతులలో తాము చేస్తున్న పోరాటాలను తెరాస సర్కార్ నిరంకుశ ధోరణితో అడ్డుకోవాలని చూస్తోందని ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి మళ్ళీ తన యాత్రను ప్రారంభించబోతున్నారు.