సంబంధిత వార్తలు
టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా అమరవీరుల స్పూర్తియాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని ప్రయత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతి లేకుండా సభను నిర్వహిస్తున్నందుకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలకు, టిజెఎసి మరియు విద్యార్ధి ఐకాస ప్రతినిధులకు మద్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకొన్నారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టి కొందరు విద్యార్ధులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.