భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేర్ పదవీకాలం ఈనెల 27తో ముగుస్తున్నందున ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి దీపక్ మిశ్రా (63)ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఓడిశా హైకోర్టులో న్యాయవాదిగా తన జీవితం ప్రారంభించారు. 1996లో ఓడిశా హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఆయన మధ్యప్రదేశ్, బిహార్, డిల్లీ హైకోర్టులలో ప్రధానన్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన గత 7 సం.లుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయన ఈ పదవిలో 14 నెలలపాటు కొనసాగుతారు.