కరీంనగర్ లో వైద్య కళాశాల ఏర్పటు చేయాలని కోరుతూ మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆగస్ట్ 5న మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు నిన్న భగ్నం చేశారు. అనంతరం ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ఆయన వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం తన డిమాండ్ నెరవేర్చేవరకు ఆసుపత్రిలోనె నిరాహారదీక్ష కొనసాగిస్తానని చెపుతున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీక్ష కొనసాగిస్తే బిపి, షుగర్, బిపి లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు పొన్నంకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆయన వైద్యులకు సహకరించకపోతే బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే అవకాశం ఉంది. తెరాస హామీలలో కరీంనగర్ లో వైద్యకళాశాల ఏర్పాటు కూడా ఒకటి. కానీ మూడేళ్ళు గడిచిపోయినా ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో దానిని సాధించేందుకు పొన్నం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంబించారు. దానిని మూడురోజులకే పోలీసులు భగ్నం చేశారు.